రీఓపెన్ చేస్తే 10 టికెట్లు తెగాయి

Varun Inzox

తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంతే. ఐతే, వైజాగ్, విజయవాడ వంటి కొన్ని ప్రాంతాల్లో ఒకట్రెండు సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్ లు స్టార్ట్ అయ్యాయి. ఏడు నెలల లాంగ్ గ్యాప్ తర్వాత బొమ్మ పడింది కొన్ని చోట్ల. కానీ, వైజాగ్ లో జనం నుంచి స్పందన రాలేదు. వరుణ్ ఐనాక్స్ లో ఒక స్క్రీన్ లో నితిన్ నటించిన “భీష్మ”ని ప్రదర్శించారు.

ఈ సినిమాని 3.35 గంటలకు, 7 గంటలకు… రెండు షోలు వేశారు. ఒక షోకి నలుగురు టికెట్లు కొన్నారు. మరో షో కి ఆరుగురు వచ్చారట. అలా ఒకరోజు ఐనాక్స్ లో “భీష్మ” సినిమాకి వచ్చిన వసూళ్ల మొత్తం. 1500 రూపాయలు.

జనంలో ఇంకా కరోనా భయం ఉంది. కేసులు కూడా పూర్తిగా తగ్గలేదు. అందుకే … జనం ఇంకా జంకుతున్నారు. పైగా… “భీష్మ” కొత్త సినిమా కాదు. ఆల్రెడీ అందరూ చూసేసిన సినిమానే.

Related Stories