చిరంజీవి చురక

Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా పొలిటికల్ విమర్శలు చెయ్యడం లేదు. ఇటు తెలంగాణాలో ముఖ్యమంత్రి కేసీఆర్ తోనూ, అటు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోనూ ఆయనకి మంచి సంబంధాలున్నాయి. కేంద్రంలో ఉన్న బీజేపి నేతలతో స్నేహబంధం ఉంది. సో.. చిరంజీవి ఎప్పుడూ ఈ ప్రభుత్వాన్ని విమర్శించారు.

ఐతే, విశాఖ స్టీల్ విషయంలో మాత్రం ఆయన ఇటీవల తరుచుగా ట్వీట్స్ వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ కంపెనీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనని విరమించుకోవాలని ఆయన కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని మరీ నొప్పించకుండా ట్వీట్స్ వేస్తున్నారు.

తాజగా విశాఖ ఉక్కు కర్మాగారం ఆక్సిజన్‌ సప్లై చేస్తున్న తీరును చూసైనా మనసు మార్చుకోవాలని ఆయన ప్రధాని మోదీని కోరారు. ఒకసారి ఆలోచన చెయ్యండి అంటూ టాగ్ చేశారు. ఇప్పుడున్న కోవిడ్ కష్టకాలంలో పలు రాష్ట్రాలకు ఆక్సిజన్‌ అందించి లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది విశాఖ ఉక్కు కర్మాగారం. ఇలాంటి గొప్ప సంస్థని ప్రైవేట్‌ పరం చేయడం ఎంత వరకు సబబో మీరే ఆలోచించండి… అని అడుగుతున్నారు చిరంజీవి.

More

Related Stories