ఈ సారి రేసుగుర్రం సన్నీనే!

- Advertisement -
Sunny


బిగ్ బాస్ తెలుగు 5 ఈ ఆదివారం ముగుస్తుంది. డిసెంబర్ 19న ఈ బిగ్ బాస్ సీజన్ విన్నర్ ఎవరో తేలుతుంది. మానస్‌, షణ్ముఖ్, శ్రీరామచంద్ర, సిరి హన్మంత్, సన్నీ పోటీలో ఉన్నారు.

100 రోజులకు పైగా హౌస్‌లో ఉన్నారు వీరంతా. వారికి సంబందించిన వీడియో ని హౌజ్ లో చూపించారు. తమ ప్రయాణాన్ని చూసుకుని వారు భావోద్వేగానికి గురయ్యారు. ఐతే, ఈ సారి విజేత వీజే సన్నీ అవుతాడు అని అంటున్నారు. ఆన్లైన్ పాపులారిటీ ట్రెండ్స్ అలా చూపిస్తున్నాయట. సోషల్ మీడియాలో కూడా అదే డిస్కషన్ నడుస్తోంది.

సింగర్ శ్రీరామచంద్ర, సన్నీ మధ్యే అసలు పోటీ. మొదట్లో రేస్ లో ముందున్న షణ్ముఖ్ ఇప్పుడు వెనుకబడ్డాడు. ఐతే, సన్నీ సైలెంట్ గా దూసుకొచ్చాడు. సన్నీ ఫైనల్ గా గెలుస్తాడా లేక సోషల్ మీడియాలో హడావిడి మాత్రమేనా అన్నది చూడాలి.

ఈ సారి గ్రాండ్ ఫినాలేకు అలియా భట్, రన్బీర్ కపూర్, దీపిక, రణ్వీర్ సింగ్ వంటి తారలు వస్తున్నారు. వారి సినిమాల ప్రమోషన్స్ కోసం ఈ బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేని వాడుకోనున్నారు.

 

More

Related Stories