శీనయ్యపై వినాయక్ సెటైర్లు

VV Vinayak

దిల్ సినిమాతో నిర్మాత రాజును “దిల్ రాజు”ను చేశాడు వినాయక్. ఆ అభిమానంతో దర్శకుడు వినాయక్ ను “హీరో వినాయక్” గా మార్చాలనుకున్నాడు దిల్ రాజు. అనుకున్నదే తడవుగా “శీనయ్య” ప్రాజెక్టును ప్రకటించాడు. ఆ వెంటనే కొన్నాళ్లకు పట్టాలపైకి కూడా తీసుకొచ్చాడు.

అయితే వీళ్లు ఎంత ఫాస్ట్ గా ఆ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకొచ్చారో అంతే ఫాస్ట్ గా అది సైడ్ ట్రాక్ లోకి కూడా వెళ్లిపోయింది. కర్ణుడి చావుకు కోటి కారణాలన్నట్టు ఈ సినిమా ఆగిపోవడానికి ఎన్నో కారణాలు. బడ్జెట్, కాస్టింగ్, కథ.. ఇలా ఎన్నో కోణాల్లో అవాంతరాలు ఎదురయ్యాయి.

అలా ఆగిపోయిన ‘శీనయ్య’పై తాజాగా వినాయక్ స్పందించాడు. అది కూడా చాలా వెరైటీగా.

‘శీనయ్య’ ప్రాజెక్టు వస్తుందా అనే ప్రశ్నకు ఏమో ఎవడికి తెలుసంటూ సెటైరిక్ గా సమాధానమిచ్చాడు వినాయక్. తను కేవలం బరువు తగ్గడం కోసమే ఆ సినిమా ఒప్పుకున్నానని, తన వైపు నుంచి తనకు తృప్తిగానే ఉందని, ఇక తేల్చాల్సింది దిల్ రాజే అన్నట్టు స్పందించాడు. మొత్తమ్మీద ఈ సినిమా ఇక రాదనే విషయాన్ని వినాయక్ పరోక్షంగా చెప్పినట్టయింది.

Related Stories