
ఇదంతా పాన్ ఇండియా చిత్రాల కాలం. దర్శకుడు వి.వి.వినాయక్ మాత్రం తెలుగులో పాన్ ఇండియా చిత్రం తీయడం కాకుండా హిందీలో తెస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్టయిన ‘ఛత్రపతి’ సినిమాని హిందీలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయి చాలా కాలమే అయింది.
ఐతే, తెలుగులో సినిమా తీయడం వేరు. హిందీలో వేరు. భాషకి సంబందించిన సమస్యలుంటాయి కదా. ఆ విషయంలోనే వినాయక్ తిప్పలు పడుతున్నట్లు సమాచారం.
ఐతే, ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది అని టీం చెప్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యేవరకు ఇంకో తెలుగు సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో లేదు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. హిందీలో సక్సెస్ అయితే దశ తిరుగుతుంది. ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రాన్ని హిందీలో సక్సెస్ ఫుల్ గా విడుదల చేసిన పెన్ స్టూడియోస్ అధినేత జయంతిలాల్ ఈ సినిమాకి నిర్మాత. సో, ఆయన బాగా హైప్ తీసుకొస్తారని నమ్ముతున్నారు.
ఐతే, వినాయక్ మాత్రం షూటింగ్ దశలోనే అనేక విషయాల్లో టెన్షన్ పడుతున్నారు అని టాక్.