మళ్లీ మెరిసిన రామ్ చరణ్

Ram Charan

రామ్ చరణ్ నటించిన “వినయ విధేయ రామ” థియేటర్లలో ఫ్లాప్ అయి ఉండొచ్చు. కానీ బుల్లితెరపై మాత్రం ఈ సినిమా సూపర్ సక్సెస్ అయింది. ఎప్పుడు ప్రసారం చేసినా మంచి రేటింగ్స్ సాధిస్తోంది. తాజాగా రిలీజైన టీఆర్పీల్లో కూడా ఈ సినిమా మరోసారి తన సత్తా చాటింది. ఆ వారం (ఆగస్ట్ 8-14) మధ్య టెలికాస్ట్ అయిన సినిమాల్లో “వినయ విధేయ రామ”దే అగ్రస్థానం. 

స్టార్ మా ఛానెల్ లో ఈ సినిమాను మరోసారి ప్రసారం చేస్తే ఏకంగా 7.28 (ఏపీ+తెలంగాణ) టీఆర్పీ వచ్చింది. కొన్ని హిట్ సినిమాల్ని మొదటి సారి ప్రసారం చేసినప్పుడు కూడా ఈ స్థాయి రేటింగ్ రాలేదు. అలా స్మాల్ స్క్రీన్ పై తన పట్టు నిలుపుకున్నాడు చరణ్. 

ఇక ఈ వారం ప్రసారమైన సినిమాల్లో కొత్తగా టెలికాస్ట్ చేసిన సినిమాలేం లేవు. ఆల్రెడీ రీ-టెలికాస్ట్ అయిన సినిమాల్లోనే “వినయ విధేయ రామ” మొదటి స్థానంలో నిలవగా.. “కేజీఎఫ్ చాప్టర్-1”, “నాన్నకు ప్రేమతో”, “బాహుబలి-2”, “పందెంకోడి-2” సినిమాలు మిగిలిన 4 స్థానాల్లో నిలిచాయి.

Related Stories