
వ్యవస్థ’… థ్రిల్లింగ్ కోర్టు రూమ్ డ్రామా ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది. ఆనంద్ రంగ దర్శకత్వం వహించటంతో పాటు పట్టాభి చిలుకూరితో కలిసి రూపొందించారు. ఇప్పటికే 150 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్‌ను సాధించి దూసుకెళ్తోంది. ఈ సందర్బంగా వ్యవస్థ టీమ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. హీరో సందీప్ కిషన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్తీక్ రత్నం
‘‘సందీప్ కిషనన్నను కలిసి తర్వాత ఆయన నాకు ఎప్పుడూ తిరుగులేని సపోర్ట్‌ను అందిస్తూనే ఉన్నారు. ఆనంద్ రంగగారితో కలిసి పని చేయటం ఎంతో ఆనందంగా ఉంది. అదృష్టంగా భావిస్తున్నాను. పట్టాభిగారు చాలా ధైర్యం చేసి తీశారు. “
హెబ్బా పటేల్
‘‘వ్యవస్థ సిరీస్‌కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అంత మంచి సక్సెస్ అందించిన ప్రేక్షకులకు, ఆనంద రంగ గారికి, సపోర్ట్ చేసిన ఎంటైర్ టీమ్‌కు ధన్యవాదాలు’’
కామ్నా జెఠ్మలానీ
“ఎగ్జయిటెడ్‌గా, నెర్వస్‌గా ఉన్నాను. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించాను. చిన్న రోల్ అయినా చాలా ఇంపార్టెంట్ ఉండటంతో యాక్సెప్ట్ చేశాను. సంపత్‌గారికి, కార్తీక్ రత్నం, హెబ్బా పటేల్ అందరికీ థాంక్స్’’
దర్శకుడు ఆనంద్ రంగ
‘నా టీమ్‌ను నా ఫ్యామిలీగా భావించి వర్క్ చేశాను. అందుకనే మంచి ఔట్‌పుట్ వచ్చింది. కంటెంట్ మీ ముందే ఉంది. ఇక మీరే చూసి ఎంజాయ్ చేయాలి’’