
త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. దాంతో, రామ్ గోపాల్ వర్మ మరోసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఒక సినిమా తీస్తున్నారు. ఈ సినిమా పేరు ‘వ్యూహం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు.
Advertisement
ఈ సినిమాని వై.ఎస్. జగన్ జైలుకి వెళ్లిన నేపథ్యం, రాష్ట్రం విడిపోవడంతో అతను ఇరుకున పడ్డ వైనం చూపిస్తున్నారు. ఐతే, మెయిన్ టార్గెట్ మాత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ రెండో టీజర్ నిండా వారిని టార్గెట్ చేసిన సీన్లే ఉన్నాయి.
వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో అజ్మల్ నటించాడు. వైయస్.భారతీ పాత్రలో మానస నటించింది.
‘వ్యూహం’ చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తి అయ్యిందని నిర్మాత దాసరి కిరణ్ తెలిపారు.
Advertisement