వరంగల్ శీను బిగ్ బెట్టింగ్!

వరంగల్ శీను బిగ్ బెట్టింగ్!

“క్రాక్” సినిమా హిట్ కావడంతో నైజాంలో ఆ సినిమాని విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను కొంత దూకుడు ప్రదర్శిస్తున్నాడు. అతని వెనుక కొందరు “పెద్దలు” ర్యాలీ అవుతున్నారు. దిల్ రాజుపై అక్కసు ఉన్నా… మొన్నటివరకు సైలెంట్ గా ఉన్నారు ఇండస్ట్రీలోని “డబుల్ టాక్ గ్యాంగ్”. ఇప్పుడు వరంగల్ శీను భుజం మీదినుంచి దిల్ రాజుపై బాణం ఎక్కుపెట్టింది ఆ గ్యాంగ్.

ఐతే, వరంగల్ శీను కూడా తగ్గట్లేదు. డిస్ట్రిబ్యూటర్ గా లీడింగ్ లో నిలబడాలని మార్కెట్ రేంజ్ ని మించి సినిమా హక్కులు కొనేందుకు ఉబలాటపడుతున్నాడు అని టాక్.

లేటెస్ట్ గా, మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోన్న “సర్కారు వారి పాట”, “పుష్ప”, “ఉప్పెన”… ఈ మూడు సినిమాలకి కలిపి 80 కోట్లు కోట్ చేశారట నిర్మాతలు. దానికి వరంగల్ శీను రెడీ అవుతున్నాడు అని టాక్. ఐతే, ఇంకా బేరం సెట్ కాలేదు. ఒప్పందాలు కూడా కాలేదు. అటు ఇటుగా డీల్ సెట్ ఐతే మాత్రం వరంగల్ శీను హవా మొదలు అవుతుంది. తెలుగు సినిమాల బిజినెస్ లెక్కలు కూడా మారుతాయి. ఇప్పట్లో అమెరికా మార్కెట్ కోలుకునేలా లేదు. దాంతో అక్కడ కోల్పోతున్న రెవెన్యూని ఏపీ, తెలంగాణలోనే పూడ్చుకోవాలి నిర్మాతలు.

దిల్ రాజుని నిలువరించాలని ఇప్పటికే ఆతని మాజీ పార్ట్నర్ లక్ష్మణ్ కూడా రంగంలోకి దిగి వరుసగా సినిమాలు కొంటున్నాడు. ఇప్పుడు వరంగల్ శీను నుంచి పోటీ.

More

Related Stories