వరంగల్ శ్రీను ఖాతాలోకే ఆచార్య

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్ రాజుపై ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన వరంగల్ శ్రీను వరుసగా సినిమాలు కొంటున్నారు. కార్తికేయ ఎక్జిబిటర్స్ పేరుతో వరంగల్ శ్రీను ‘ఇస్మార్ట్ శంకర్’, ‘క్రాక్’ వంటి హిట్ సినిమాలు తెలంగాణాలో విడుదల చేశారు. దిల్ రాజుకి చెక్ పెట్టేందుకు అతన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు కొందరు ఎంకరేజ్ చేస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. ఆలా.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ వరంగల్ శ్రీను ఖాతాలోకి వెళ్ళింది.

ఈ సినిమా హక్కులు తాము తీసుకున్నట్లు వరంగల్ శ్రీనుకి చెందిన కార్తికేయ ఎక్జిబిటర్స్ తన ట్విట్టర్ ఖాతాలో అధికారికంగా అనౌన్స్ చేసింది.

చిరంజీవి ఇంతకుముందు చిత్రం ‘సైరా’ 32 కోట్లకు అమ్ముడుపోయింది. ‘ఆచార్య’ సినిమాని దాదాపు 40 కోట్లకు కొన్నారట వరంగల్ శ్రీను. ఇప్పుడు టికెట్ రేట్స్ పెరిగాయి. అలాగే ఈ సినిమా సమ్మర్ లో (మే 13) రిలీజ్ అవుతోంది కాబట్టి ఈ రేట్ వర్కౌట్ అవుతుందనేది ఆయన అంచనా.

కొరటాల శివ రూపొందిస్తున్న ఈ మూవీకి అన్ని భారీ రేట్లే చెప్తున్నారు నిర్మాత నిరంజన్ రెడ్డి. శివ దగ్గరుండి ఈ సినిమా బిజినెస్ డీల్స్ క్లోజ్ చేస్తున్నారట. శర్వానంద్ నటించిన ‘శ్రీకారం’, రానా యాక్ట్ చేస్తోన్న ‘విరాటపర్వం’ కూడా వరంగల్ శ్రీను ఖాతాలోనే ఉన్నాయి.

More

Related Stories