
కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న కల్లోలం అంతా ఇంతా కాదు. ఆసుపత్రిల్లో బెడ్స్ లేక, ఆక్సిజన్ సీలిండర్లు దొరక్క మరణించే వారి సంఖ్య ఎక్కువ. కొందరు సినిమా తారలు సోషల్ మీడియా ద్వారా తమవంతు చేయూత అందిస్తున్నారు. కొందరు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు.
హీరోయిన్ తమన్న కూడా తాజాగా ఒక పోస్ట్ చేసింది.
“కరోనా మానవాళిని అనేక సమస్యల్లోకి నెట్టింది. కానీ ధైర్యాన్ని కోల్పోయే సమయం కాదిది. పాజిటివ్ దృక్పథంతో ఉండడం అవసరం. నమ్మకంతో పోరాడండి, కృతజ్ఞతని కనబరచండి. ఇతరులకు తోడ్పాటు అందించాలి. ముఖ్యంగా అన్ని జాగ్రత్తలు తీసుకొండి. మర్చిపోకండి… ఈ పోరాటంలో మనమంతా కలిసే ఉన్నాం,” ఇలా పెద్ద పోస్ట్ పెట్టింది. తనని ఫాలో అయ్యేవారికి ధైర్యం నింపే ప్రయత్నం చేసింది తమన్న.
తమన్న నటించిన ‘సీటీమార్’ విడుదల కావాల్సి ఉంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది డైరెక్షన్లో రూపొందిన ఈ మూవీ కరోనా కల్లోలం వల్ల ఆగిపోయింది.