తరుణ్, ప్రియమణి ప్రేమించుకున్నారా!?

తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో అతడి చుట్టూ కొన్ని లవ్ ఎఫైర్లు కూడా నడిచాయి. అయితే ఈ లిస్ట్ లో ప్రియమణి పేరు మాత్రం ఎప్పుడూ రాలేదు. తాజాగా తరుణ్-ప్రియమణి ఎఫైర్ కూడా బయటకొచ్చింది. దీన్ని బయటపెట్టింది కూడా మరెవరో కాదు, స్వయంగా ప్రియమణి.

తరుణ్ తో ”నవ వసంతం” అనే సినిమా చేసింది ప్రియమణి. ఈ సినిమా టైమ్ లో వీళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నట్టు వార్తలు వచ్చాయట. స్వయంగా తరుణ్ తల్లి రోజారమణి, సెట్స్ లో ప్రియమణి వద్ద కొచ్చి.. ఇద్దరూ ప్రేమించుకుంటే చెప్పమని కోరారట. ఇద్దరికీ పెళ్లి చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారట.

రోజా రమణి వచ్చి తనతో చెప్పేవరకు తరుణ్ కు తనకు సంబంధించి అలాంటి గాసిప్ ఒకటి నడుస్తుందనే విషయం తెలియదని చెప్పుకొచ్చింది ప్రియమణి.

ఆ టైమ్ లో తనకు చాలా నవ్వొచ్చిందని, వెంటనే అమ్మానాన్నకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పి నవ్వుకున్నానని అంటోంది ప్రియమణి. 

Related Stories