‘యశోద’ సీక్వెల్స్ తీస్తాం: టీం

సమంత హీరోయిన్ గా నటించిన ‘యశోద’ రెండో వారంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా టీం మీడియాతో ముచ్చటిచ్చింది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్

‘యశోద’కు ట్రెమండస్‌ రెస్పాన్స్ వస్తోంది. ఫస్ట్ డే స్లోగా స్టార్ట్ అయిన సినిమా… ఆ రోజు సాయంత్రానికి మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్స్ తెచ్చుకుంది. మంచి సినిమా తీస్తే విజయం అందిస్తామని కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు థాంక్స్.

సమంత గారి వన్ విమన్ షో ‘యశోద’. సమంత గారు అద్భుతం. ఆవిడ మాకు ఎనర్జీ ఇచ్చారు. ప్రతి ఒక్కరి జీవితంలో మబ్బులు ఉంటాయి. ఇప్పుడు ఆవిడ ఎదుర్కొంటున్నదీ అంతే! ఆవిడ మళ్ళీ సూపర్ ఎనర్జీతో వస్తారు. ‘యశోద 2’ గురించి చాలా మంది అడుగుతున్నారు.

వరలక్ష్మీ శరత్ కుమార్

ఇదొక అందమైన సినిమా. ఫిమేల్ సెంట్రిక్ సినిమాలకు కృష్ణప్రసాద్ గారు సపోర్ట్ చేస్తారని చాలా మంది చెప్పారు. ఈ సినిమా విషయంలో మరోసారి అది రుజువైంది.

దర్శకులు హరి, హరీష్

తెలుగులో మాకు ఇది తొలి సినిమా. అన్ని భాషల నుంచి వస్తున్న స్పందన ఎంతో సంతోషాన్నిచ్చింది. మాకు ఇది చాలా మ్యాజికల్ మూమెంట్. అవకాశం ఇచ్చిన కృష్ణప్రసాద్ గారికి థాంక్స్. సమంత గారికి చాలా పెద్ద థాంక్స్. ఆవిడ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ‘యశోద 2’ విషయంలో మాకు ఒక ఐడియా ఉంది. సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా ఉంది. అయితే… అది సమంత గారిపై ఆధారపడి ఉంది. పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చిన తర్వాత, ఆవిడతో డిస్కస్ చేస్తాం. సమంతగారు ఒప్పుకుంటే సీక్వెల్స్ చేస్తాం.

రచయితలు పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి

ఈ క్షణం ఇక్కడ నిలబడటానికి కారణం మా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ గారు. ‘మీరు రాయగలరు. రాయండి. మీ ఇద్దరూ సక్సెస్ అయితే చూడాలని ఉంది’ అని మమ్మల్ని ఆశీర్వదించారు. ముందుగా ఆయనకు థాంక్స్. తమిళ్ తెలిసిన అమ్మాయి, తెలుగు నేటివిటీ తెలిసిన అబ్బాయి కలిసి పని చేస్తే బావుంటుందని, కథకు న్యాయం చేస్తారని ఆయన అన్నారు. కృష్ణప్రసాద్ గారికి ఉన్న ట్రెండీ మనసు ఇంకొకరికి ఉండదు. మాకు అవకాశం ఇచ్చిన హరి, హరీష్ గారికి థాంక్స్. ఇద్దరు కలిసి ఎలా పని చేయాలో వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. మమ్మల్ని హేమాంబర్ గారు బాగా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద స్టార్ కాస్ట్, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న సినిమాకు కొత్త రచయితలతో మాటలు రాయించుకోవడానికి యాక్సెప్ట్ చేసిన సమంతగారికి ధన్యవాదాలు.

 

More

Related Stories