నైట్ పార్టీలెన్నో చేసుకున్నారట

- Advertisement -

ఎన్టీఆర్ – రామ్ చరణ్ మధ్య ఫ్రెండ్షిప్ ఇప్పుడు డెవలప్ అయింది కాదు అంటున్నారు రాజమౌళి. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా కోసం వాళ్ళు ఫ్రెండ్స్ కాలేదు. “ఈ సినిమా కన్నా ముందే వారి మధ్య స్నేహం ఉంది. అందుకే, వీరిని తీసుకున్నా. నా సినిమా వల్ల వారు ఫ్రెండ్స్ అయ్యారు అనుకోవద్దు,” అని రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు, తామిద్దరం ఎన్నో నైట్ పార్టీలు చేసుకున్నామని చెప్తున్నారు ఈ హీరోలు. తన భార్యకి చెప్పకుండా చరణ్ తో కలిసి నైట్ పార్టీలకు వెళ్లానని ఎన్టీఆర్ చెప్పారు.

“నా భార్య ప్రణతి బర్త్ డే మార్చి 26. ఇక చరణ్ బర్త్ డే 27న. మార్చి 26 అర్ధరాత్రి 12 కాగానే వెంటనే చరణ్ దగ్గరికి వెళ్లి అతని బర్త్ డే పార్టీల్లో మునిగేవాడిని. అలా ఎన్నో సార్లు నైట్ అంతా సెలెబ్రేట్ చేసుకున్నాం,” అని తెలిపాడు తారక్.

వీరి స్నేహం సినిమా కోసం ఏర్పడినది కాదన్న విషయంలో స్పష్టత వచ్చింది.

 

More

Related Stories