మనోజ్ పెళ్లి డేట్ ఫిక్సంట

- Advertisement -
Manchu Manoj and Bhuma Mounika

హీరో మంచు మనోజ్ మరోసారి పెళ్ళికి సిద్ధమవుతున్నాడు. ప్రముఖ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో మనోజ్ బంధం గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరి పెళ్ళికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం.

వచ్చే నెల మూడో తేదీన వీరి వివాహం జరగనుంది అని లేటెస్ట్ టాక్.

మంచు మనోజ్ 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లాడాడు. కానీ వారి వివాహ బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2019లో తాము విడిపోయినట్లు మనోజ్ ప్రకటించాడు. ఇక కరోనా కాలం నుంచి అతను, మౌనిక రెడ్డి ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. ఇటీవల ఒక పూజా కార్యక్రమానికి జంటగా కలిసి వెళ్లారు. అప్పుడే వీరి పెళ్లి ఖాయం అనే వార్తలు వచ్చాయి.

భూమా నాగిరెడ్డి, శోభ నాగిరెడ్డి దంపతుల చిన్న కూతురు మౌనిక. ఆమె అక్క అఖిల ప్రియా మాజీ మంత్రి. మౌనిక, మనోజ్ మధ్య స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పరిణయంగా మారబోతోంది.

 

More

Related Stories