
2024 భారతీయ సినిమా హీరోయిన్లకు పెళ్లిళ్ల సంవత్సరంలా కనిపిస్తోంది. ఈ ఏడాది చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడిని పెళ్లాడింది. త్వరలో తాప్సి పన్ను కూడా బ్యాడ్మింటన్ ప్లేయర్ మాథిస్ బోని పెళ్లాడనుంది. ఈ నెలలోనే వీరి పెళ్లి జరుగుతుందని టాక్. అలాగే “స్పీడున్నోడు” “ఇడో రకం ఆడో రకం” హీరోయిన్ సోనారిక కూడా గత నెలలో తన ప్రియుడిని పెళ్లాడింది.
ఇక తాజాగా తన పెళ్లి కబురుని తీసుకొచ్చింది నటి వరలక్ష్మి శరత్ కుమార్. “క్రాక్” సినిమాతో తెలుగులో పాపులర్ అయిన ఈ తమిళనటి ఇప్పుడు తెలుగులో అనేక సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. ఈ భామ రెండు రోజుల క్రితం తన స్నేహితుడితో నిశ్చతార్ధం జరుపుకొంది. త్వరలోనే పెళ్లి డేట్ ప్రకటిస్తారు.
ఇక హీరోయిన్ తమన్నా కూడా లైన్లో ఉంది. ఆమె బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉంది. వీరి పెళ్లి ఈ ఏడాదే ఉంటుంది అని వార్తలు షికార్లుచేస్తున్నాయి.
“బాణం”, “ఒంగోలు గిత్త”, “బ్రూస్లీ” వంటి తెలుగు సినిమాల్లో నటించిన కృతి ఖర్బందా కూడా తన ప్రియుడిని పెళ్లి చేసుకొంది. ఇటీవలే ఈ భామ తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఈ హింట్ ఇచ్చింది. పుల్కిత్ సామ్రాట్ అనే బాలీవుడ్ హీరోతో ఆమె రిలేషన్ షిప్ లో ఉంది.

READ MORE: Varalaxmi Sarathkumar gets engaged to Nicholai Sachdev
కంగన రనౌత్ కూడా తన పెళ్లి గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది. “నేను డేటింగ్ లో ఉన్న మాట నిజమే. పెళ్లి గురించి, నేను చేసుకోబోయే అతని గురించి త్వరలోనే చెప్తాను,” అని ఇటీవలే కంగన ప్రకటించింది.