వాల్తేర్ సెన్సార్ టాక్!

సంక్రాంతి బరిలో నిలిచిన ‘వాల్తేర్ వీరయ్య’ మిగతా సినిమాలతో పోల్చితే లేట్ గా రానుంది. బాలయ్య నటించిన ‘వీర సింహ రెడ్డి’, విజయ్ నటించిన ‘వారసుడు’, అజిత్ మూవీ ‘తెగింపు’ జనవరి 12న విడుదల కానున్నాయి. అదే ‘వాల్తేర్ వీరయ్య’ జనవరి 13న రిలీజ్ అవుతుంది. అంటే ఒక రోజు లేట్ గా వస్తుంది ఈ సంక్రాంతి మూవీ. కానీ సెన్సార్ కార్యక్రమాలు విషయానికి వస్తే ఇదే ముందు క్లియరెన్స్ తెచ్చుకొంది.

‘వాల్తేర్ వీరయ్య’కి యుఏ సర్టిఫికెట్ వచ్చింది. కట్స్ కూడా ఎక్కువ లేవు. మరి ఈ సినిమాకి సెన్సార్ టాక్ ఎలా ఉంది?

సెన్సార్ టాక్ ఎలా ఉందంటే…

రెండు పాటలు సూపర్ గా ఉన్నాయట
చిరంజీవి మాస్ మూమెంట్స్ ఒకప్పటి ఆయన అభిమానులకు నచ్చే ఛాన్స్
రవితేజ, చిరంజీవి మధ్య సన్నివేశాలు హైలెట్
రవితేజ ఎపిసోడ్ లో ట్విస్ట్ అదుర్స్
సాధారణ కథ

ఓవర్ ఆల్ గా సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది సెన్సార్ టీం నుంచి. సంక్రాంతి పండుగ టైంలో అభిమానులు కోరుకునే ఎలిమెంట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నిర్మాతలు, బయ్యర్లు, అభిమానులు నిశ్చింతగా ఉండొచ్చు అని ఈ టాక్ ని బట్టి అనిపిస్తోంది.

 

More

Related Stories