మే 31.. మహేష్ నుంచి ఏం రాబోతోంది?

మే 31.. ఘట్టమనేని అభిమానులకు పండగ రోజు. ఆ రోజు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు. కృష్ణగారి బర్త్ డే ను ఏటా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారు. పైగా ఆరోజు మహేష్ కు సెంటిమెంట్. తండ్రి పుట్టినరోజన తన కొత్త సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్ డేట్ ఇవ్వడం మహేష్ కు అలవాటు. మరి ఈసారి మహేష్ ఏం చేయబోతున్నాడు?

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమా ఓపెనింగ్ కూడా అయింది. త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. ఈ మూవీకి సంబంధించి అప్ డేట్ కోసం ఫ్యాన్స్ చాన్నాళ్లుగా వెయిటింగ్. కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించి ఏదైనా అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్, హీరోయిన్ ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.

త్రివిక్రమ్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు మహేష్. ఈ కాంబో కోసం చాలా ఏళ్లుగా ఫ్యాన్స్ వెయిటింగ్. అటు రాజమౌళి కూడా ఈ సినిమా కోసం కథలు ప్రిపేర్ చేస్తున్నాడు. నిజానికి ఈ మూవీ ఎనౌన్స్ మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 31న ఆ సినిమా ప్రకనట వస్తే ఫ్యాన్స్ కు పండగే.

మరోవైపు ఇవన్నీ పక్కనపెట్టి మహేష్ మరోసారి విదేశాలకు పయనమయ్యాడు. సర్కారువారి పాట సినిమా ప్రమోషన్ పూర్తిచేసిన ఈ హీరో, కుటుంబంతో కలిసి విదేశాలకు వెళ్లాడు.

 

More

Related Stories