
సమంత ఒక సినిమాకి తీసుకునే పారితోషికం 2 కోట్లు. ప్రస్తుతం గుణశేఖర్ తీస్తున్న ‘శాకుంతలం’ సినిమాకి ఇంకొంచెం ఎక్కువే తీసుకొంది. దానికి ఉన్న కారణాలు వేరు. సాధారణంగా ఆమె పారితోషికం రెండు కోట్ల రేంజు.
తాజాగా ఈమె నటించిన ‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్ విడుదలైంది. దీనికోసం ఆమె ఎంత అందుకున్నది అనే విషయంలో రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ‘ది ఫ్యామిలీ మేన్’ మొదటి సీజన్ బాగా హిట్ అయింది కాబట్టి రెండో సీజన్ లో నటించిన వారందరికీ భారీగానే ఇచ్చారట. అలా, సమంతకి మూడు కోట్లపైనే అందింది అని టాక్.
ఒక సినిమాకి ఎన్ని రోజుల డేట్స్ ఇస్తుందో… అంతే వర్క్ చేసింది సమంత ఈ వెబ్ సిరీస్ కోసం. కానీ పారితోషికం మాత్రం సినిమా కన్నా ఎక్కువ వచ్చింది. ఇపుడు జాతీయ స్థాయిలో ఫేమ్ లభించింది. ఇది బోనస్. ఏ రకంగా చూసిన ఆమెకి మొదటి వెబ్ సిరీస్ ఒక బంపర్ ఆఫర్.
Also Check: Samantha Akkineni’s stylish avatar