చిరు బర్త్ డే ప్రకటన ఏంటి?

Chiranjeevi


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వచ్చేస్తోంది. ఈ నెల 22న ఆయన 68వ పుట్టిన రోజు జరుపుకుంటారు. ఇంకా నాలుగు రోజులే ఉంది చిరంజీవి బర్త్ డేకి. మరి ఈ పుట్టిన రోజుకి ఆయన నుంచి వచ్చే కొత్త ప్రకటన ఏంటి. కొత్త సినిమా గురించి అధికారిక ప్రకటన ఇస్తారా? ఈ ప్రశ్నలు అభిమానుల మైండ్ లో ఉన్నాయి.

ప్రస్తుత సమాచారం ప్రకారం చిరంజీవి వెంటనే సినిమా మొదలు పెట్టకపోచ్చు. ఇటీవలే ఆయన మోకాలికి సర్జరీ జరిగింది. రెస్ట్ అవసరం.

“భోళా శంకర్” ఫ్లాప్ కావడం ఆయనని ఇబ్బందిలోకి నెట్టేసిన మాట కూడా వాస్తవమే. “వాల్తేర్ వీరయ్య” భారీ విజయంతో మెగాస్టార్ కామెడీ టచ్ ఉన్న సినిమాలు చెయ్యాలి అనుకున్నారు. అందుకే, “భోళా శంకర్”లో ఆ ప్రయత్నం చేశారు కానీ అది బెడిసి కొట్టింది. ఇప్పుడు తదుపరి చిత్రాల విషయంలో ఆయన మరోసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

చిరంజీవి ఇప్పటికే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కథని ఓకె చేశారు. “సోగ్గాడే చిన్ని నాయన”, “బంగార్రాజు” చిత్రాలతో రూరల్ కామెడీ చిత్రాలు బాగా హ్యాండిల్ చెయ్యగలనని నిరూపించుకున్నారు కళ్యాణ్ కృష్ణ. ఇది కాకుండా అనిల్ రావిపూడి – దిల్ రాజ్ మూవీ, “బింబిసార” దర్శకుడితో మరో చిత్రం కూడా ఓకె చెప్పారు.

ఇందులో కళ్యాణ్ కృష్ణ సినిమా ముందు మొదలు కావొచ్చు. ఎందుకంటే ఆ సినిమాని మెగాస్టార్ కూతురు సుష్మిత నిర్మించనుంది. మిగతా కథలు, ప్రాజెక్ట్ లపై మరింత క్లారిటీ కావాలి.

Advertisement
 

More

Related Stories