డిసెంబర్ 31 కన్నా ముందే చెప్పేశారుగా

Rajinikanth

“ఇంట్లో నుంచి కదలొద్దు, మీటింగులు, షూటింగులు వద్దు….. బాగా రెస్ట్ తీసుకొండి..”

ఇది సూపర్ స్టార్ రజినీకాంత్ కి డాక్టర్లు ఇచ్చిన సలహా. ఇన్ డైరెక్ట్ గా రాజకీయ ప్రకటనలకు, ప్రచారాలకు దూరంగా ఉండండి… ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొండి అని చెప్పినట్లే. దాంతో… రజినీకాంత్ నిర్ణయం ఎలా ఉంటుంది అనే ఆసక్తి అందరిలో ఉండింది. తన రాజకీయ పార్టీ ప్రకటన ఈ నెల 31న చెప్తాను అని స్వయంగా రజినీకాంత్ ఇంతకుముందు చెప్పారు. కానీ ఆ డేట్ కన్నా ముందే రజినీకాంత్ తన అభిప్రాయం చెప్పేశారు.

70 ఏళ్ల వయసులో, ఆల్రెడీ ఆరోగ్య సమస్యలుండగా రాజకీయాల్లోకి వెళ్లడం ఎందుకు, ఆ రిస్క్ అనవసరం అని రజినీకాంత్ కుటుంబ సభ్యులు గట్టిగా చెప్పారు. సో… అన్ని ఆలోచించుకొని రజినీకాంత్ తన నిర్ణయాన్ని చెప్పేశారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం లేదు, పార్టీ పెట్టడం లేదు అని క్లారిటీగా ఈ రోజు ప్రకటించారు రజినీకాంత్.

బీజేపీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఎదురుకున్న రజినీకాంత్… తన హెల్త్ దృష్ట్యా డ్రాప్ అయ్యారనేది రాజకీయ విశ్లేషకుల మాట. రజినీకాంత్ పార్టీ పెట్టాలనేది ప్రధాని మోదీ, అమిత్ షా వ్యూహం అని అంటున్నారు. అందుకే, రజినీకాంత్ ఏంతో తర్జన భర్జన పడ్డారు. ఫైనల్ గా నో అనేది ఆయన నుంచి వచ్చిన సమాధానం.

More

Related Stories