31న ఏమి ప్లాన్ చేస్తున్నారు?

Mahesh Babu and SSMB28

మే 31న కృష్ణ పుట్టిన రోజు స్పెషల్ గా త్రివిక్రమ్ – మహేష్ బాబు సినిమా ప్రకటన వస్తుందనుకుంటే మేడే నాడే వచ్చింది. మరి… మే 31న ఏమి సర్ ప్రైజ్ ఇవ్వనున్నారు? టైటిల్ ప్రకటిస్తారా? మహేష్ బాబు ఫ్యాన్స్ లో మెదులుతోన్న ప్రశ్నలివే.

ప్రతి ఏడాది తన తండ్రి పుట్టిన రోజున అభిమానులకు ఎదో ఒక ట్రీట్ ఇస్తాడు… సినిమా టీజర్ రూపంలోనో, పోస్టర్ విడుదల చేసో, లేదా ఏదైనా కొత్త మూవీ ప్రకటించో. గత ఏడాది పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా టైటిల్ ని ప్రకటించారు. ఈఏడాది ‘సర్కారు వారి పాట టీం నుంచి టీజర్ రావొచ్చని అనుకుంటున్నారు.

‘సర్కారు వారి పాట’ టీం నుంచి ఒక ట్రీట్ ఉంది కాబట్టే త్రివిక్రమ్ తన సినిమాని మే 1న ప్రకటించారట. త్రివిక్రమ్ ఆ రోజు టైటిల్ మరేదైనా అప్డేట్ ఇవ్వొచ్చు. లేదూ సైలెంట్ గా ఉండొచ్చు.

Advertisement
 

More

Related Stories