బర్త్ డేకి ఏంటి సర్ప్రైజ్?

NTR

ఎన్టీఆర్ అభిమానులకు మే నెల అంటే ఒక పండుగలాంటి సీజన్. మే 20…యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే. ఈసారి బర్త్ డేకి ఎన్టీఆర్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ వస్తుంది? ఇదే అభిమానులను తొలుస్తున్న ప్రశ్న.

ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల తీస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. ఇది భారీ చిత్రం. వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అవుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. ఈ సారి బర్త్ డే టైంలో ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ లోనే ఉంటారు. ఐతే, ఏదైనా ఒక పోస్టర్ కానీ, ఒక ఫోటో కానీ విడుదల చేద్దామని ప్లాన్ చేస్తోంది.

ఐతే, ఈ సినిమా టైటిల్ ని ఇప్పుడే ప్రకటించక పోవచ్చు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమాకి ఒక పవర్ ఫుల్ టైటిల్ ని ఫిక్స్ చేశారు కొరటాల శివ. అన్ని భాషల్లో కనెక్ట్ అయ్యే టైటిల్ అది. కాకపోతే, ఇప్పుడే ప్రకటించే అవకాశం లేదు.

మే 20న రానున్న ఆ సర్ప్రైజ్ గురించి మరింత క్లారిటీ రావాలంటే ఇంకో వారం ఆగాలి. ఈ నెల మూడో వారం నుంచి ఈ సినిమాకి సంబంధించిన మూడో షెడ్యూలు ప్రారంభం అవుతుంది. ఎన్టీఆర్ సరసన ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటిస్తోంది. సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు.

ALSO READ: జాన్వీ…దాంట్లో…దీంట్లో!

Advertisement
 

More

Related Stories