ఆ రోజున ఆమె ఏమి చెప్తుంది?

2022లో చాలామంది హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకున్నారు. పేరెంట్స్ గా మారారు. యువ హీరోలు, హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం వింతేమీ లేదు. కానీ, 60 ప్లస్ వాళ్ళూ, 45 ప్లస్ హీరోయిన్లు కూడా డేటింగ్ కబుర్లు, డివోర్స్ ప్రకటనలు, మళ్ళీ పెళ్లి ముచ్చట్లు వంటివి చేసి ఒక రచ్చ లేపారు.

ఇండియన్ పరిశ్రమ కూడా హాలీవుడ్ లా మారింది అనిపిస్తోంది ఇలాంటి హడావిడి వల్ల. అక్కడ వయసు మళ్ళిన హీరోయిన్లు, కుర్ర హీరోలను పెళ్లి చేసుకోవడం కామన్. అలాగే, ముసలి హీరోలు పాతికేళ్ల పడుచులతో డేటింగ్ చేస్తుంటారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ట్రెండ్ మన దగ్గర కూడా నడుస్తోంది.

అందుకే, హీరోయిన్ మలైక పెళ్లి వార్త కొంతకాలంగా బాగా నలుగుతోంది. 2023లో ఆమె 50వ పుట్టిన రోజు జరుపుకోనుంది. 50 ఏళ్ల వయసులో ఆమె రెండో పెళ్లి చేసుకుంటుందా అనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న.

ఆమె గత కొన్నేళ్లుగా తన కన్నా 12 ఏళ్ల చిన్నవాడైన అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది. ఇటీవల ఆమె మళ్ళీ తల్లి కాబోతున్నట్లు పుకార్లు చెలరేగడంతో ఆమె, అర్జున్ కపూర్ బాగా ఫీల్ అయ్యారు. ఆ టైంలోనే క్లారిటీ ఇచ్చారు. తమ పెళ్లి విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదని. ఇక, పిల్లలు అనే మాటే రాదన్నట్లుగా చెప్పారు.

ఐతే, 50వ పుట్టిన రోజు (అక్టోబర్ 23) ఆమె ఏమి నిర్ణయం తీసుకోనుంది? పెళ్లి విషయంలో ఒక ప్రకటన చేస్తుందా? లేక సహజీవనమే కంటిన్యూ చేస్తుందా? మరో 10 నెలల్లో ఆమె లైఫ్ కొత్త దశలోకి ఎంటర్ కానుంది అనేది వాస్తవం.

ALSO READ: Malaika Arora for Disney Plus Hotstar event

 

More

Related Stories