నాని ఆలోచన ఏంటి?

‘హిట్’లో విశ్వక్ సేన్ హీరో. ‘హిట్ 2’కి వచ్చేసరికి అడివి శేష్ హీరో అయ్యాడు. ‘హిట్ 3’లో నాని హీరో అని ‘హిట్ 2’ చివర్లో చూపించారు. ఇప్పటివరకు యువ హీరోలు నటించారు. ఇప్పుడు నానిలాంటి ఒక రేంజ్ ఉన్న హీరో నటించబోతున్నాడు ‘హిట్’ సిరీస్ లో.

‘హిట్ 3’ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు కానీ వచ్చే ఏడాది డిసెంబర్ లోనే విడుదల చెయ్యాలి అని అనుకుంటున్నారట.

నాని ప్రస్తుతం ‘దసరా’ సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఈ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. ఆ తర్వాత చెయ్యబోయే సినిమా గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చెయ్యలేదు నాని. అది ‘హిట్ 3’ అవుతుందా? మరో సినిమానా అనేది చూడాలి.

‘దసరా’ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ సంపాదించుకోవాలి అనేది నాని ప్లాన్. భారీగా ఖర్చు పెట్టి నిర్మిస్తున్నారు. ఐదు భాషల్లో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆ సినిమా రిజల్ట్ ని బట్టి నాని కొత్త సినిమాల ప్లానింగ్ ఉంటుంది. సో, ‘హిట్ 3’ విషయంలో ఇప్పుడు క్లారిటీగా చెప్పలేం.

 

More

Related Stories