నయనతారే ఎందుకు? స్పెషలేంటీ?

Nayanthara

హిందీలో హిట్టయిన “అంధాధున్” సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు నితిన్. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం (హీరోయిన్ కాదు) చాలామందిని సంప్రదించినట్టు వార్తలొస్తున్నాయి. కొన్ని రోజులు అనసూయ పేరు, మరికొన్ని రోజులు ఒరిజినల్ పాత్ర పోషించిన టబు పేరు, తాజాగా నయనతార పేరు వినిపిస్తోంది.

ఎంత మంది పేర్లు వినిపించినా అంతా రిజెక్ట్ చేస్తున్నట్టుగానే వార్తలు వస్తున్నాయి. ఇంతమంది తిరస్కరిస్తున్న ఆ పాత్ర ఏంటనే సందేహం చాలామందికి కలిగే ఉంటుంది. వాళ్ల కోసమే “అంధూధూన్”లో ఆ కీలక పాత్ర ఏంటనే విషయాన్ని బ్రీఫ్ గా అందిస్తున్నాం.

ఇంతకీ ఆ క్యారెక్టర్ ఏంటంటే.. భర్త ప్రేమగా చూసుకుంటున్నప్పటికీ అక్రమ సంబంధం పెట్టుకునే ఓ మహిళ పాత్ర అది. తన అక్రమ సంబంధం తెలిసిపోయిందని భర్తను చంపేస్తుంది. ఈ విషయం హీరోకు తెలిసిపోయిందని అతడ్ని కూడా చంపడానికి సిద్ధపడే పాత్ర.

సౌత్ లో ఇలాంటి క్యారెక్టర్ చేయాలంటే కాస్త గట్స్ ఉన్న హీరోయిన్ కావాల్సిందే. రమ్యకృష్ణ, అనసూయ… ఇలా పలువురు పేర్లు అనుకున్న… సినిమాకి క్రేజ్ రావాలంటే కాస్త క్రేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ కావాలి. అందుకే నయనతార కోసం అనుకుంటున్నారు. ఐతే, నయన్ ఈ సినిమా ఒప్పుకోవడం కష్టమే.

Related Stories