బంగార్రాజు స్టార్ట్ అయ్యేదెప్పుడు?


నాగార్జున నటించిన “వైల్డ్ డాగ్” సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది. అలాగే, నాగ్ ఇప్పుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో కొత్త సినిమా చేయనున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడు. ఆ తర్వాత “బంగార్రాజు” స్టార్ట్ అవుతుందని టాక్ ఐతే ఉంది. కానీ దీనిపై పూర్తిగా క్లారిటీ లేదు.

“బంగార్రాజు”లో నటించేందుకు నాగ చైతన్య నో చెప్పాడు. అఖిల్ ఆసక్తి చూపడం లేదు. కథ ప్రకారం, నాగార్జునతో పాటు మరో హీరో ప్రెజెన్స్ కంపల్సరీ. ఐతే, మరో హీరో ఎవరు? అదే ఇంకా తేలలేదు. దాంతో, “బంగార్రాజు” ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చెప్పలేకపోతున్నాడు నాగ్. మరోవైపు, ఈ సినిమా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ నిర్మాతగా మారి చిన్న సినిమా నిర్మిస్తున్నాడు. బిగ్ బాస్ ఫేమ్ దివి హీరోయిన్ గా ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అరకులో జరుగుతోంది.

ఆ సినిమా పనులు పూర్తి అయిన తర్వాత “బంగార్రాజు” గురించి ఆలోచిస్తాడేమో.

More

Related Stories