
తమిళనాడు గవర్నర్ గా కృష్ణంరాజుని నియమించారంటూ గత నెలలో టీవీ ఛానెల్స్ మోత మోగించాయి. ఇక అయన చెన్నై ఫ్లైట్ ఎక్కడమే ఆలస్యం అన్నట్లుగా హడావిడి చేశాయి. దాదాపు నెల రోజులు గడిచింది. కానీ మళ్ళీ ఆ ఊసే లేదు. గతంలో కూడా కృష్ణంరాజు పేరు గట్టిగా వినిపించింది. కానీ ఎందుకో కృష్ణంరాజుని ఆ పదవి ఊరిస్తూ అక్కడే ఆగిపోతోంది.
కృష్ణంరాజు బీజేపీలో ఆయన సీనియర్ నాయకుడు. గత పదేళ్లుగా ఆయన రాజకీయాల్లో యాక్టివ్ గా లేని మాట వాస్తవమే. అలాగే, మోడీ వచ్చిన తర్వాత బీజేపీకి ఆయన ప్రత్యేకంగా చేసిందేమి లేదు. కానీ ఆలిండియా లెవల్లో ప్రభాస్ కున్న పాపులారిటీ, ఇతర సమీకరణాల కారణంగా కృష్ణంరాజుకి గవర్నర్ పదవి దక్కడం గ్యారెంటీ అనేది రాజకీయ విశ్లేషకుల మాట.
ఆయనకిప్పుడు 81 ఏళ్ళు. ఇంకా ఆలస్యం చెయ్యడం కరెక్ట్ కాదు. ఇస్తే ఇప్పుడే ఇవ్వడం బెటర్. గవర్నరు అయ్యానని అనే ఆనందం ఉంటుంది.