మెహర్ మూవీ ప్రకటన ఎప్పుడు?

meher ramesh chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు లైన్లో పెట్టదనేది పాత న్యూస్. ఐతే రోజుకో వార్త వస్తోంది చిరంజీవి మూవీస్ గురించి. పక్కా సమాచారం ప్రకారం… “ఆచార్య” ముగిసిన తర్వాత చిరంజీవి మొదలు పెట్టే మూవీ మెహెర్ రమేష్ డైరెక్షన్లోనే.

మెహర్ రమేష్ డైరెక్షన్ కి గ్యాప్ వచ్చి చాలా ఏళ్ళు అయింది. “కంత్రి”, “బిల్లా”, “శక్తి”, “షాడో” సినిమాలు డైరెక్ట్ చేసిన మెహర్ రమేష్.. తన చిరకాల కోరిక నెరవేర్చుకోబోతున్నాడు.

“నేను సినిమాల్లోకి వచ్చిందే చిరంజీవిని చూసి. ఫారిన్ లో మంచి జాబ్ చేసుకునేవాడ్ని. చిరంజీవి నుంచి స్ఫూర్తి పొంది ఇండస్ట్రీకొచ్చాను. రైటింగ్, డైరక్షన్ అంటే ఇష్టం కాబట్టి అటువైపు వెళ్లాను. నా జీవితాశయమే చిరంజీవితో సినిమా చేయడం. ఇప్పుడా ఆశయానికి కొద్దిగా దగ్గరగా వచ్చాను. చిరంజీవితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. అంతకుమించి మరే కోరిక లేదు. ఇప్పుడా డ్రీమ్ సాకారం అవుతోంది,” అంటూ ఆనందంగా చెప్తున్నాడు.

ఇలా చిరంజీవితో సినిమా చేస్తున్న విషయాన్ని మెహర్ రమేష్ బయటపెట్టాడు. తను మెగాఫోన్ కు దూరమైనా, ఇండస్ట్రీ పనులతో బిజీగానే ఉన్నానంటున్నాడు ఈ దర్శకుడు. చాలా స్క్రిప్టుల్లో పాలుపంచుకున్నాడట. గడిచిన మూడేళ్లుగా మాత్రం పూర్తిగా చిరంజీవితో చేయాల్సిన సినిమాపైనే దృష్టిపెట్టానంటున్నాడు మెహర్ రమేష్.

మరి ఈ సినిమా ప్రకటన వచ్చేదెప్పుడు?

Related Stories