
మరో వారం రోజుల్లో పవన్ సెట్స్ పైకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. “వకీల్ సాబ్” సినిమాకు సంబంధించి పెండింగ్ వర్క్ ను పవర్ స్టార్ కంప్లీట్ చేస్తారంటూ స్టోరీలు వచ్చేస్తున్నాయి. మరోవైపు పవన్ ను చూస్తే మాత్రం అనుమానాలు అలానే ఉన్నాయి. అవును.. పవన్ ఇంకా షూటింగ్ కు సిద్ధమైనట్టు లేదు.
తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశారు పవన్. హైదరాబాద్ వరదబాధితులకు ఆర్థిక సహాయం అందిస్తూ ఆ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ గెటప్ చూసి ఫ్యాన్స్ ఒకింత షాక్ కు గురయ్యారు. మరింత గడ్డం పెంచేశాడు. జుట్టు కూడా బాగా పెరిగిపోయింది.
ఈ గెటప్ చూసిన జనాలు, అసలు పవన్ ఇప్పట్లో సెట్స్ పైకి వస్తాడా అనే అనుమానం వ్యక్తంచేస్తున్నారు. యూనిట్ మాత్రం దసరా తర్వాత పవన్ సెట్స్ పైకి వస్తాడని కాన్ఫిడెన్స్ గా చెబుతోంది. వర్షాల వల్ల షెడ్యూల్ లో మార్పులు ఉంటాయి. ఖచ్చితంగా ఎపుడు మొదలవుతుంది అనేది త్వరలోనే తేలుతుంది. సో… అప్పుడు గెటప్ మార్చేస్తాడు.