మరి రాధేశ్యామ్ రిలీజ్ ఎప్పుడు?

Radhe Shyam still

“రాధే శ్యామ్” షూటింగ్ ఆలా సాగుతూనే ఉంది. 2018లో ప్రారంభం అయినా ఈ సినిమాకి ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చెయ్యలేదు. కానీ షూటింగే మొదలుకాని “ఆదిపురుష్” సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఈ సినిమా 2022లో ఆగస్టు 11న విడుదల అవుతుంది. మరి “రాధే శ్యామ్” వచ్చే ఏడాది సమ్మర్ కి వస్తుందా? లేక ఆ తర్వాత? దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

ప్రభాస్, పూజ హెగ్డే నటిస్తోన్న “రాధే శ్యామ్” షూటింగ్ పార్ట్ చివరిదశకు చేరుకొంది. ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తే కానీ… నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో రూపొందే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గురించి క్లారిటీ రాదు. “రాధే శ్యామ్”, “ఆదిపురుష్” సినిమాల మధ్య నాగ్ అశ్విన్ మూవీని ప్రభాస్ రిలీజ్ చేయగలడా అన్నది చూడాలి.

ప్రభాస్ ఈ మధ్య నటిస్తున్న సినిమాలన్నీ పాన్ -ఇండియా చిత్రాలే. అంటే ఇండియా అంతా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. ఇలాంటి సినిమాల రిలీజ్ డేట్స్ ఏడాది ముందే ఫిక్స్ చేసుకోవాలి. బాలీవుడ్ లో షూటింగ్ మొదలు పెట్టకముందే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి… దానికే కట్టుబడి ఉంటారు.

Related Stories