అన్ని వాయిదాలే… మోక్షమెప్పుడో!


“ఆర్ ఆర్ ఆర్” సినిమాతో మొదలైంది వాయిదాల పర్వం. జనవరి 7కి విడుదల కావాల్సిన రాజమౌళి బడా చిత్రం ‘ఓమైక్రాను కరోనా’ కేసుల కారణంగా చివరి నిమిషంలో విడుదల కాకుండా ఆగింది. జనవరి 7న విడుదల తేదీ కాగా జనవరి 1న వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది టీం. ఒక వారం తర్వాత ‘రాధే శ్యామ్’ టీం కూడా అదే పని చేసింది. ‘రాధే శ్యామ్’ నిరవధికంగా వాయిదా పడింది.

ఈ రోజు ‘ఆచార్య’ వాయిదాకి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. కొత్త డేట్ ఎప్పుడో చెప్పలేదు. మహేష్ బాబు నటిస్తున్న “సర్కారు వారి పాట” పాటల ప్రొమోషన్ కూడా వాయిదాపడింది. సంక్రాంతికి రావాల్సిన మొదటి పాట రాలేదు. అంటే, సినిమా కూడా ఏప్రిల్ 1న రావడం లేదు. కొత్త డేట్ వెతుక్కోవాలి.

మరి ఫిబ్రవరిలో విడుదల కావాల్సిన ‘భీమ్లా నాయక్’ కూడా మళ్ళీ డేట్ మార్చుకుంటుందా అనేది చూడాలి.

ఐతే, ఇప్పుడు ఈ పెద్ద సినిమాలకు కొత్త డేట్స్ ఎప్పుడు ఫిక్స్ అవుతాయో ఎవరు చెప్పలేకపోతున్నారు. కరోనా భయం పూర్తిగా పోయినప్పుడే రిలీజ్ అవుతాయి. “ఆర్ ఆర్ ఆర్”, “రాధేశ్యామ్” వంటి సినిమాలకు దేశమంతా పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. అందుకే, వీటికి మోక్షం ఎప్పుడు అనేది కాలమే నిర్ణయిస్తున్నది.

 

More

Related Stories