వరుణ్ మూవీ డేట్ ఎప్పుడు?

కోవిడ్ సెకండ్ వేవ్ తాట తీస్తోంది. గతేడాది కన్నా ఇప్పుడు ఎక్కువగా స్ప్రెడ్ అవుతోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. దాంతో ఒక్కొక్కటిగా సినిమా వాయిదా పడుతోంది. ఈ నెలలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’, ‘తలైవి’ చిత్రాలు వాయిదాపడ్డాయి. వచ్చేనెలలో విడుదల కావాల్సిన ‘ఆచార్య’, బాలకృష్ణ మూవీ కూడా వాయిదా బాట పడే ఛాన్స్ ఉంది.

దాంతో, రిలీజ్ డేట్స్ అన్ని తారుమారు అవుతున్నాయి. అందుకే.. వరుణ్ తేజ్ తన సినిమా డేట్ విషయంలో తొందరపడటం లేదు. వరుణ్ తేజ్ నటిస్తున్న బాక్సింగ్ డ్రామా ‘గని’ సినిమా రిలీజ్ కి సరైన డేట్ దొరకడం లేదు. జులై 30న విడుదల చేద్దామని ప్లాన్ చేస్తే ఆ డేట్ ని ‘రాధేశ్యామ్’ లాక్ చేసుకొంది.

ఒకవేళ, ‘రాధేశ్యామ్’ వాయిదా పడితే ‘గని’ అదే డేట్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు క్లారిటీ లేదు కాబట్టే… కొత్త డేట్ ప్రకటించలేదు.

More

Related Stories