
రియా చక్రవర్తి కనిపించడం లేదు. మొన్న అర్ధరాత్రి ఆమె ఇంటి నుంచి పారిపోయింది అని బీజేపీ అనుకూల ఇంగ్లిష్ న్యూస్ ఛానల్ రిపోర్ట్ చేసింది.
రియా ఎక్కడుందో కనుక్కోలేకపోయామని, ఫోన్ కు కూడా అందుబాటులో లేదని ప్రకటించారు బీహార్ పోలీసులు. ముంబై పోలీసులు తమకి సహకరించడం లేదంటూ గగ్గోలు పెడుతున్నారు బీహార్ పోలీసులు.
ఈ కేసుకు సంబంధించి రియా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. పాట్నాలో నమోదైన కేసును, ఆల్రెడీ సుశాంత్ కేసును హ్యాండిల్ చేస్తున్న ముంబయి పోలీసులకు అప్పగించాల్సిందిగా ఆమె కోరారు. బహుశా సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు రియా ఎవ్వరికీ కనిపించదేమో.
ఒక పార్టీకి అనుకూలంగా ఉండే మీడియా …. సడెన్ గా ఈ కేసుని జాతీయ ఇష్యూగా మార్చుటూ “స్వయంగా విచారణ” చేస్తుండడంతో… రియా కావాలనే స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటుంది.