అప్డేట్ లేదా పుష్ప?

Allu Arjun

అల్లు అర్జున్ నటిస్తున్న ‘పుష్ప 2’ షూటింగ్ సైలెంట్ గా సాగుతోంది. ఐతే, ఈ సినిమా షూటింగ్ గురించి కానీ, సినిమా విశేషాలు కానీ ఏవీ ఇంతవరకు అధికారికంగా బయటపెట్టలేదు. షూటింగ్ మొదలైనప్పుడు కూడా హడావుడి చెయ్యలేదు. జనవరి 1న ఏదైనా పోస్టర్ వదులుతారు అనుకున్నారు ఫ్యాన్స్. జరగలేదు.

ఇక ఈ రోజు సుకుమార్ పుట్టిన రోజు. ఆయన బర్త్ డే సందర్భంగా ఏమైనా స్పెషల్ అప్డేట్ ఉంటుంది అని భావిస్తే నిరాశే ఎదురైంది ఫాన్స్ కి. దాంతో, అభిమానులు నిర్మాణ సంస్థకి ట్యాగ్ చేస్తూ, “అప్డేట్ లేదా పుష్ప?” అంటూ హడావిడి చేస్తున్నారు.

“పుష్ప” కన్నా “పుష్ప 2″పై భారీ అంచనాలున్నాయి. ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్ట్ లో ఈ సినిమా రెండో స్థానంలో ఉంది. అందుకే, “పుష్ప 2” విషయంలో అల్లు అర్జున్ కానీ, దర్శకుడు సుకుమార్ కానీ తొందపడడం లేదు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం ప్రచారం చేద్దామని భావిస్తున్నారు.

“పుష్ప 2” సినిమాకి అల్లు అర్జున్ దాదాపు 100 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడు. ఆ రేంజులో ఈ సినిమా బిజినెస్ జరగనుంది.

Advertisement
 

More

Related Stories