మరో మాస్ విజిల్ సాంగ్!


హీరో రామ్ సినిమాల్లో మంచి మాస్ సాంగ్ ఉంటుంది. అతని డ్యాన్స్ కూడా కిరాక్ ఎక్కించేలా ఉంటుంది. రామ్ ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో ఒక మూవీ చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పేరు …ది వారియర్. ఈ సినిమాలోని ఒక పాత ఇప్పటికే 100 మిలియన్ల వ్యూస్ పొందింది ఇప్పుడు ఇంకో హుషారెత్తించే మాస్ పాట వచ్చింది.దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన  ‘విజిల్’ పాటను హీరో సూర్య ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో లిరికల్ వీడియో ప్రదర్శించారు. 

“విజిల్ వేసే బాధ్యత ప్రేక్షకులదే. వేయియించాల్సిన బాధ్యత నాది. మేం అడిగిన వెంటనే సాంగ్ విడుదల చేసిన సూర్య గారికి థాంక్స్. ముందుగా… దేవి శ్రీ ప్రసాద్ గురించి మాట్లాడాలి. ‘బుల్లెట్…’ సాంగ్‌తో స్టార్ట్ చేశాడు. అది ఇంకా రన్ అవుతుంది. ఎక్కడా ఆగడం లేదు. ఈ రోజే విడుదల చేశామా అన్నట్టు ట్రెండ్ అవుతోంది. సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. ‘విజిల్’ సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు.

‘విజిల్’ సాంగ్ షూట్ చేసేటప్పుడు ‘ది వారియర్’ అనే టైటిల్ ఎందుకు పెట్టామో అర్థం అయ్యింది… చాలా ప్రాబ్లమ్స్ వచ్చినా సాంగ్ ఫినిష్ చేయాలని చేశాం. రంజాన్ సమయంలో ఉపవాసం చేస్తూ జానీ మాస్టర్ సాంగ్ కొరియోగ్రఫీ చేశారు. వేరే షూటింగ్ ఉన్నప్పటికీ… మేనేజ్ చేసి డేట్స్ అడ్జస్ట్ చేసి కృతి ఈ సాంగ్ చేసింది. ఈ సినిమాలో మాస్ కృతిని చూస్తారు,” అన్నారు రామ్.

Whistle Lyrical Song (Telugu) | The Warriorr | Ram Pothineni, Krithi Shetty | DSP | Lingusamy

“రామ్ గారు ఉంటే సినిమాలో ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఉండాలి. ఆయన పెర్ఫార్మన్స్ చూడటం కోసం! విజిల్ మహాలక్ష్మి కోసం ఒక విజిల్ సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసినందుకు లింగుస్వామి గారికి థాంక్స్. ‘ఉప్పెన’ తర్వాత డీఎస్పీ గారితో నేను చేస్తున్న చిత్రమిది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు,” అని ఆనందంగా చెప్పింది కృతి శెట్టి.

ఈ సినిమా జూలై 14న విడుదల కానుంది.

 

More

Related Stories