విజయ్ విడాకులు… ఆ పని ఎవరిది?

Vaarasudu


తమిళనాడులో తిరుగులేని సూపర్ స్టార్ …. విజయ్. హీరోగా టాప్ కి చేరుకున్నారు. 1999లోనే అతనికి పెళ్లి జరిగింది. అంటే పెళ్లయి దాదాపు 23 ఏళ్ళు అయింది. ఆయన భార్య సంగీతకి, ఆయనకి ఇద్దరు పిల్లలు. కొడుకు త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇస్తారని టాక్.

ఐతే ఉన్నట్టుండి నిన్న వికీపీడియా పేజీలో కొన్ని మార్పులు జరిగాయి. విజయ్ తన భార్య సంగీతకి విడాకులు ఇచ్చాడని, మరో హీరోయిన్ తో ఉంటున్నట్లు ఆ పేజీలో రాశారు. అది బాగా వైరల్ అయింది. గంటలోపే దాన్ని మార్చారు. తీరా చూస్తే కొందరు ఆకతాయిల పని తేలింది. తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ కి, అజిత్ ఫాన్స్ కి పచ్చగడ్డి వేస్తె భగ్గుమనే వైరం.

అభిమానుల మధ్య గొడవల కారణంగా ఇలాంటి పని జరిగి ఉంటుంది అని అనుమానిస్తున్నారు.

విజయ్ ఫలానా హీరోయిన్ తో సహజీవనం చేస్తున్నాడు అని ఈ పేజీలో రాయడం మరింత సంచలనం అయింది. ఐతే, ఈ పుకార్లని నమ్మేలా ఉన్నాయి అని ఇండస్ట్రీలో కొందరు భావించారు. ఎందుకంటే విజయ్ భార్య ప్రస్తుతం ఇండియాలో లేదు. పిల్లలతో కలిసి ఆమె విదేశాల్లో వెకేషన్ కి వెళ్లారట. న్యూ ఇయర్, క్రిస్మస్ సెలెబ్రేషన్స్ కి వెళ్లడంతో జనం సులువుగా నమ్ముతారని ఈ ప్రచారం క్రియేట్ చేశారని అంటున్నారు.

‘వారసుడు’ (వరిసు) సినిమా విడుదల కారణంగా విజయ్ వెకేషన్ కి వెళ్ళలేదు.

 

More

Related Stories