హేమ వెనుక ఉన్నది ఆయనేనా!

Hema

“మా” (మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌) ఎన్నికల ప్రకటన ఇంకా రాలేదు. కానీ అప్పుడే ఆరోపణల పర్వంలోకి వచ్చింది ఆట. లేటెస్ట్ గా నటి హేమ చేసిన కొన్ని ఆరోపణలు పెద్ద కలకలం రేపాయి. “మా” అధ్యక్షుడు నరేశ్‌ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపణలు చేశారు. ఆమె ఆరోపణలను నరేష్ ఇప్పటికే కొట్టిపారేశారు. అంతేకాదు, తాజాగా హేమకి షోకాజ్ నోటీసులు వెళ్లేలా చూశారు నరేష్.

నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు “మా” క్రమశిక్షణ సంఘం హేమకు ఈ రోజు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. కానీ హేమ పెద్దగా పట్టించుకోవడం లేదు. తన ఆరోపణలకు ఆధారాలున్నాయి అన్నట్లుగా ఆమె చెప్తున్నారు.

మరోవైపు, ఆమె వెనుకాల ఒక పెద్ద వ్యక్తి ఉన్నారని నరేష్ అనుమానిస్తున్నారు. ఆమె సొంతంగా చేసిన ఆరోపణలు కావివి, ఆమె వెనుకాల ఉన్న వ్యక్తి చేయిస్తున్న గేమ్ అని నరేష్ ఆఫ్ ది రికార్డు చెప్తున్నారు. ఇంతకీ హేమ వెనుక ఉన్నది నరేష్ అనుమానిస్తున్న ‘శక్తి’ ఒక్కరేనా?

సెప్టెంబర్ లో “మా” ఎన్నికలు ఉండాలని మెగాస్టార్ చిరంజీవి సహా పలువురు నటులు పట్టుబడుతున్నారు. కానీ, “మా” ప్రస్తుత అధ్యక్షుడు తన పదవి దిగేందుకు ఆసక్తి చూపడం లేదట. ఎదో వంక చెప్పి… ఎన్నికలను మరో ఆర్నెళ్లు వాయిదా వేసే ప్రయత్నాలు నరేష్ చేస్తున్నట్లు మిగతా నటుల అనుమానం. అందుకే ఈ రచ్చ.

Advertisement
 

More

Related Stories