మోనాల్ ని ఈ వీకెండ్ సేవ్ చేస్తారా?

Monal Gajjar

మోనాల్ గజ్జార్ గత మూడు వారాలుగా ఎలిమినేషన్ వరకు వచ్చింది. కానీ లాస్ట్ మినిట్ లో ఆమె ఎలిమినేషన్ నుంచి సేవ్ అవుతూ వస్తోంది. మరి ఈ వీకెండ్ లో కూడా ఆమెని సేవ్ చెయ్యగలరా? ఆమెని బలవంతంగా ఫైనల్ -5 (చివరి వరకు పోటీలో నిలిచే ఐదుగురు)కి చేరుస్తారా?

మోనాల్ నిజానికి పాపులారిటీలో వీక్ గా ఉంది. మొదట్లో రొమాన్స్ సీన్లతో కాకా రేపింది. కానీ ఆ తర్వాత ఆమె జనాలని ఆకట్టుకోలేక పోయింది. ఈపాటికే ఆమె బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చి ఉండాల్సింది. ఐతే ప్రతి వీకెండ్ ఆమెకి లక్ కలిసొచ్చింది.

“సుడిగాడు”, “వెన్నెల వన్ అండ్ హాఫ్” వంటి చిత్రాల్లో నటించిన మోనాల్ … బిగ్ బాస్ పై చాలా ఆశలు పెట్టుకొంది. బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వచ్చాక సినిమా ఛాన్సులు వస్తాయని భావిస్తోంది.

Related Stories