వేగేశ్నకి ఏ హీరో సై అంటాడు?

Satish Vegesna

“శతమానంభవతి” సినిమా తప్ప సతీష్ వేగేశ్న తీసిన మిగతా సినిమాలన్నీ అపజయాలే. “శ్రీనివాసకల్యాణం”లో నటించి నితిన్, “ఎంత మంచివాడవురా” ఒప్పుకొని కళ్యాణ్ రామ్ చేతులు కాల్చుకున్నారు. అందుకే కాబోలు, ఇప్పుడు ఆయన తన కొడుకునే హీరోగా పరిచయం చేస్తున్నాడు.

ఈ విషయాన్నీ తెలుగుసినిమా.కాం ఇంతకుముందే ప్రచురించింది. తన తనయుడు సమీర్ ను హీరోగా పరిచయం చేయబోతున్నాడు సతీష్ వేగేశ్న.

ఐతే, ఈ సినిమాని మల్టీ స్టారర్ గా మలుస్తున్నాడు. ఓ యంగ్ హీరో ఇందులో నటిస్తాడని చెబుతున్నాడు. బహుశా.. సమీర్ ది సెకెండ్ హీరో రోల్ అయి ఉండొచ్చు. మరి వేగేశ్నకి ఒకే చెప్పే ఆ యంగ్ హీరో ఎవరబ్బా? అంత రిస్క్ తీసుకునేదెవ్వరు?

Related Stories