
‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత, హేమ… ఇలా పలువురు పోటీలో ఉన్నారు. ఇందులో ప్రకాష్ రాజ్ కి చిరంజీవి సంపూర్ణ మద్దతుంది. పలువురు పెద్ద హీరోలు ఇప్పటికే ప్రకాష్ రాజ్ కి మాటిచ్చారు. మరి మంచు విష్ణు ఎవరి మద్దతు అందుకోనున్నారు? అలాగే బాలయ్య ఎవరి వైపు ఉంటారు అనేది ఆసక్తికరంగా మారింది.
చిరంజీవి వ్యతిరేక వర్గంలో బాలయ్య ఉంటారని చెప్పక్కర్లేదు. ఆ లెక్కలో చూస్తే, ‘మా’ ఎన్నికల్లో బాలయ్య, అయన వర్గం మంచు విష్ణు వైపు ఉంటారనే టాక్ నడుస్తోంది. మరి బాలయ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ప్రకాష్ రాజ్ బాలయ్యని కూడా కలిసి మద్దతు కోసం ప్రయత్నిస్తారట.
ఎన్నికలకు ఇంకా రెండున్నర నెలల టైం ఉంది. కానీ అప్పుడే అందరూ ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ఈ వీకెండ్ నుంచే అందరి హీరోలని పర్సనల్ గా కలిసే ప్రయత్నం చేస్తున్నారు.