
ఇంకా ఖచ్చితంగా పది రోజుల్లో బిగ్ బాస్ తెలుగు 4 ముగుస్తుంది. సెప్టెంబర్ మొదటివారంలో మొదలైంది. కరోనా పీక్ లో ఉన్న టైంలో ప్రారంభమయింది బిగ్ బాస్ 4. ఇది వంద రోజులు పూర్తి చేసుకోవడం కష్టం, హౌస్ లో ఎవరికైనా కరోనా సోకితే…. అంతే సంగతులు, ప్రోగ్రాం మధ్యలోనే ఆగిపోతుంది అన్న కామెంట్స్ మొదట్లో వినిపించాయి. కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా… గ్రాండ్ ఫినాలే వరకు వచ్చింది.
ఈ నెల 20న (ఆదివారం)… నాలుగు గంటల పాటు సాగుతుంది గ్రాండ్ ఫినాలే. అదిరిపొయ్యెలా ప్లాన్ చేస్తోంది టీం. హీరోయిన్ల డాన్సులు, స్పెషల్ గెస్ట్ తో టైటిల్ విన్నర్ ని ప్రకటించడం వంటి రెగ్యులర్ ఎలెమెంట్స్ ఎలాగూ ఉంటాయి. దాంతో పాటు ఈ సారి కొన్ని సర్ప్రైజ్ లు కూడా ఉండొచ్చని టాక్.
ఇంతకుముందు ఒక సీజన్ కి చిరంజీవి, మరో సీజన్ కి వెంకటేష్ స్పెషల్ గెస్ట్ గా విచ్చేశారు. మరి ఈ సారి ఎవరో ఆ స్టార్ గెస్ట్?