ప్రభాస్ తో పోటీపడేదెవ్వరో!

Prabhas


ప్రభాస్ సినిమాలన్నీ వాయిదాబాట పడుతూనే ఉన్నాయి. ప్రభాస్ నటించిన, నటిస్తున్న నాలుగు సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ డేట్స్ మార్చుకుంటున్నాయి. తాజాగా ‘ఆదిపురుష్’ సినిమాని సంక్రాంతి 2023కి మార్చారు. జనవరి 12, 2023న విడుదల కానుంది ‘ఆదిపురుష్’.

సంక్రాంతి బరిలో రెండు, మూడు పెద్ద సినిమాలు నిలవడం సహజం. మరి, వచ్చే సంక్రాంతికి ప్రభాస్ తో పోటీ పడే హీరోలెవ్వరో?

ప్రస్తుత ట్రెండ్ ని బట్టి చూస్తే… రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ విడుదల అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుంది. ఐతే, శంకర్ సినిమా కాబట్టి పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ హడావిడి ఎక్కువ. అవి అనుకున్న టైంలో పూర్తి అయితే రామ్ చరణ్ మూవీ ప్రభాస్ ‘ఆదిపురుష్’తో పోటీ పడుతుంది. కానీ, ఇది కూడా పాన్ ఇండియా మూవీనే. కాబట్టి రెండు తెలుగు పాన్ ఇండియా చిత్రాలు ఒకే టైంలో పోటీ పడుతాయా అన్నది చూడాలి.

మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా ఈ ఏప్రిల్, మేలో ప్రారంభం కాగలిగితే సంక్రాంతి బరిలో నిలుస్తుంది. బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా కూడా పోటీ పడే అవకాశం ఉంది.

Advertisement
 

More

Related Stories