- Advertisement -

నిజానికి ఇంతకుముందు డబుల్ ఎలిమినేషన్ జరగాల్సింది. ఆఖరి నిమిషంలో నాగార్జున అలాంటిదేం లేదని చెప్పడంతో హౌజ్ లో కంటెస్టెంట్లు అంతా ఊపిరి పీల్చుకున్నారు. మళ్ళీ ఆ ప్రాసెస్ ఎప్పుడు?
అసలు.. Bigg Boss Telugu 4 – Episode 28లో అసలు ఏం జరిగిందో ఓసారి చూస్తే, అసలు మేటర్ అర్థమౌతుంది.
శనివారం నాటి ఎపిసోడ్ లో ఊహించని విధంగా స్వాతి దీక్షిత్ ను ఎలిమినేట్ చేశాడు నాగార్జున. అయితే ఈ క్రమంలో ఎవ్వర్నీ నాగ్ సేవ్ చేయలేదు. అందరూ ఇంకా ఎలిమినేషన్ రౌండ్ లోనే ఉన్నారు. ఇదే విషయాన్ని చెబుతూ శనివారం ఎపిసోడ్ ముగించాడు.
ప్రస్తుతానికైతే ఎలిమినేషన్ రౌండ్ లో స్వాతిదీక్షిత్ పోగా.. హారిక, కుమార్ సాయి, సోహైల్, మెహబూబ్, లాస్య, అభిజీత్ ఉన్నారు. నెక్స్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరు? ఇంకా ఎంతమంది గెస్ట్ లుగా రానున్నారు? ఈ వారం తేలనుంది.