ఈసారి బాలయ్యకి విలన్ ఎవరు?

Balakrishna in BB3

తన సినిమాల్లో హీరోనే కాదు, విలన్ పాత్రల కోసం కూడా స్టార్స్ ను తీసుకోవడం బోయపాటికి అలవాటు. జగపతి బాబును విలన్ గా మార్చేసింది ఇతడే. ఆది పినిశెట్టిని విలన్ గా తయారుచేసింది కూడా ఇతడే. ఇలా తన ప్రతి సినిమాలో ఫేస్ వాల్యూ ఉన్న నటుల్ని విలన్ గా తీసుకునే బోయపాటి.. ఇప్పుడు బాలయ్యతో చేస్తున్న కొత్త సినిమా కోసం విలన్ అన్వేషణలో పడ్డాడు.

నిజానికి ఈ విషయంలో ఇప్పటికే సంజయ్ దత్ని తీసుకోవాలని అనుకున్నాడు బోయపాటి. కానీ కాన్సర్ బారిన పడిన సంజయ్ దత్ ఉన్నఫలంగా అందుబాటులోకి రాడు.

అందుకే ఇప్పుడు కొత్త ముఖాల కోసం వెదుకుతున్నాడు బోయపాటి. ఈ సినిమాలో సీరియస్ విలన్ తో పాటు.. తేనెపూసిన కత్తిటైపు సాఫ్ట్ విలన్ పాత్ర కూడా ఒకటి ఉందట. ఆ పాత్ర కోసమే మొన్నటివరకు నవీన్ చంద్ర. నవీన్ పొలిశెట్టి లాంటి పేర్లు వినిపించాయి. తాజాగా అల్లరి నరేష్ పేరు కూడా వినిపిస్తోంది. సినిమా మళ్లీ సెట్స్ పైకి వచ్చేలోపు దీనిపై బోయపాటి ఓ నిర్ణయం తీసుకోబోతున్నాడు.

Related Stories