మహేష్ కి ఇంకో హీరోయిన్ ఎవరు?

Mahesh Babu


మహేష్ బాబు – త్రివిక్రమ్ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. సంక్రాంతి పండుగ తర్వాత షూటింగ్ ముహూర్తం ఉండొచ్చు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఎందుకంటే త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ లో ఇద్దరు భామలు కంపల్సరీ. రెండో భామకి ఎంత ప్రాధాన్యం ఉంటుంది అనేది పక్కన పెడితే మల్టీపుల్ హీరోయిన్ల కథలు ఆయనికి బాగా అచ్చి వచ్చాయి.

‘అత్తారింటికి దారేది’, ‘అల వైకుంఠపురంలో’, ‘అరవింద సమేత’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’…. ఇలా చాలా సినిమాలు చెపుకోవచ్చు.

ఇక, తాజా సినిమాలో మెయిన్ హీరోయిన్ గా పూజ హెగ్డే ఎప్పుడో కన్ఫిమ్ అయిందనే విషయం మనకు తెలుసు. రెండో హీరోయిన్ ఎవరు? శ్రీలీల పేరుని మొన్నటి వరకు పరీశీలించారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నట్లు టాక్. దానికి కారణమేంటో తెలీదు.

ముందు అనుకున్న కథ వేరు, ఇప్పుడు తీస్తున్న స్టోరీ వేరు. బహుశా ఈ స్టోరీ, స్క్రీన్ ప్లేలో మార్పుల వల్ల రెండో హీరోయిన్ పాత్ర స్వభావం, స్వరూపం మారి ఉంటుంది. సో, ఇప్పుడు కొంచెం స్టార్డం ఉన్న హీరోయిన్లని తీసుకోవాలని భావిస్తున్నట్లు టాక్.

 

More

Related Stories