
విశ్వక్ సేన్ తో సినిమా చేసేది లేదని ప్రకటించారు నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా. అలాంటి నిబద్దత, క్రమశిక్షణ లేని నటుడిని తన జీవితంలో చూడలేదని అర్జున్ ఆరోపించారు. దానికి కౌంటర్ సమాధానం ఇచ్చారు విశ్వక్ సేన్. అర్జున్ ఐడియాలు అన్నీ పాత కాలానికి చెందినవనీ, తాను చెప్పిన ఒక సలహా కూడా పాటించేందుకు ఆయన ఒప్పుకోలేదని విశ్వక్ సేన్ తెలిపారు.
మొత్తానికి విశ్వక్ సేన్ వర్సెస్ అర్జున్ అన్న యుద్ధంలో ఎవరిది పైచేయి అన్నది పక్కన పెడితే విశ్వక్ సేన్ కి మాత్రం బాగా డ్యామేజీ జరిగింది. అలాగే, సినిమా నిర్మాణ పరంగా అర్జున్ కి కూడా నష్టమే. విశ్వక్ సేన్ పై ఇప్పటివరకు పెట్టిన డబ్బులో కొంత నష్టపోవాల్సిందే.
ఇక ఇప్పుడు ఇంకో సమస్య అతని స్థానంలో మరో హీరోని తీసుకోవాలి. హీరో మాత్రమే మారుతారు. హీరోయిన్ మాత్రం ఆయన కూతురు ఐశ్వర్య అర్జున్ ఉంటుంది. కూతురి కెరీర్ ని నిలబెట్టేందుకు అర్జున్ ఈ సినిమా తీస్తున్నారు.
శర్వానంద్, నాగ శౌర్య వంటి వారిని అప్రోచ్ అయ్యారట అర్జున్. మరి ఇందులో ఎవరు ఒప్పుకుంటారో చూడాలి. శర్వానంద్ కెరీర్ కూడా బ్రైట్ గా ఏమి లేదు. ఇక నాగ శౌర్య వరుస ప్లాపుల్లో ఉన్నాడు.