రావిపూడి తన హీరోలకు ఎందుకు లోపాలు పెట్టాడు?

ఎఫ్2లో వెంకటేష్, వరుణ్ తేజ్ పాత్రలు సాధారణంగానే ఉంటాయి. మిడిల్ క్లాస్ ను రిప్రజెంట్ చేసేలా ప్రవర్తిస్తాయి. కానీ ఎఫ్3కి వచ్చేసరికి వీళ్ల పాత్రలు పూర్తిగా మార్చేశాడు దర్శకుడు అనీల్ రావిపూడి. మరీ ముఖ్యంగా వరుణ్ తేజ్ పాత్రకు నత్తి, వెంకటేష్ పాత్రకు రేచీకటి అనే లోపాల్ని పెట్టి ప్రేక్షకులకు చిన్నపాటి షాక్ ఇచ్చాడు.

అనీల్ రావిపూడి ఎందుకిలా చేశాడు. ఇలా రేచీకటి, నత్తి లాంటి ఎలిమెంట్స్ పెట్టకపోతే ఫన్ జనరేట్ అవ్వదా? దీనికి రావిపూడి సమాధానం చెబుతున్నాడు. భారీగా పెరిగిన అంచనాల్ని అందుకోవాలన్నా, ఎక్స్ ట్రా కిక్ కావాలన్నా, ఇలాంటివి తప్పదంటున్నాడు.

“ఎఫ్2పై పెద్దగా అంచనాల్లేవు. కాబట్టి స్క్రిప్ట్ ప్రకారం వెళ్లిపోయాం. కానీ ఎఫ్3పై అంచనాలు బాగా ఉన్నాయి. వాటిని అందుకోవాలంటే కేవలం స్క్రిప్ట్ ఉంటే సరిపోదు. క్యారెక్టర్స్ కూడా మార్చాల్సిందే. దీంతో క్యారెక్టర్స్ నుంచే కొత్త రకంగా ఎత్తుకోవాలని నిర్ణయించుకున్నాను. క్యారెక్టర్లలోనే ట్విస్ట్ ఉంటే, అక్కడ్నుంచే సినిమా కలర్ మారిపోతుంది. ఫన్ యాంగిల్ దొరుకుతుంది. అందుకే బాగా ఆలోచించి వరుణ్ తేజ్ కు నత్తి, వెంకటేష్ కు రేచీకటి పెట్టాం. హీరోలకు ఇచ్చిన ఆ డైమన్షన్లు బాగా వర్కవుట్ అయ్యాయి.”

మెహ్రీన్, తమన్న హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ ఓ కీలక పాత్ర పోషించింది. పూజాహెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది. 27న సినిమా థియేటర్లలోకి వస్తోంది.

Advertisement
 

More

Related Stories