దేవి ఖేల్ ఖతమ్ ఎందుకయింది అంటే… ?

Bigg Boss Telugu 4 – Episode 22

కల చెదిరింది.. గేమ్ మారింది.. లేడీ బిగ్ బాస్ అవుతానంటూ బరిలో దిగిన దేవి చాలా తొందరగా ఔట్ అయింది. ఈ వీక్ ఎలిమినేషన్స్ లో దేవి తట్టాబుట్టా సర్దేసింది. దీంతో ఆమె బిగ్ బాస్ జర్నీ ముగిసింది.

ఎలిమినేషన్స్ రౌండ్ లో ఎంతమంది ఉన్నప్పటికీ ఈవారం మెహబూబ్ లేదా దేవిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని అంతా ఊహించారు. ముందుగా లీకులు మెహబూబ్ పైనే వచ్చాయి. అయితే ఆ వెంటనే దేవి పేరు తెరపైకి వచ్చింది. అలా దేవి తన గేమ్ ముగించింది.

హౌజ్ లో చాలామందితో అంటీముట్టనట్టు ఉండే దేవి, ఈసారి ఎలిమినేట్ అవుతుందని అంతా ముందే ఊహించారు. ఆ ఊహలకు తగ్గట్టే దేవి ఎగ్జిట్ జరిగిపోయింది. మరీ ముఖ్యంగా ఈ సీజన్ బిగ్ బాస్ ఫార్ములాలోకి దేవి ఫిట్ కాలేకపోయింది. అమ్మాయిలంతా ఎవరో ఒకరికి దగ్గరవ్వగా, దేవి మాత్రం సోలోగా మిగిలిపోయింది. అది ఆమె ఆటకు ఇబ్బందికరంగా మారింది. దీనికితోడు అరియానాకు ఆమె మరీ ఓవర్ గా మద్దతివ్వడం కూడా మిగతా కంటెస్టెంట్లకు నచ్చలేదు.

హౌజ్ లో దేవి అంటే గిట్టని వాళ్లే ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఆమె ఎలిమినేట్ అయినప్పుడు మాత్రం అంతా మూకుమ్మడిగా ఎమోషన్ బాగా పండించారు. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు జరిగిన అన్ని ఎలిమినేషన్స్ కంటే దేవి ఎలిమినేషనే కాస్త ఎక్కువ ఎమోషనల్ గా సాగింది. సూట్ కేసు సర్దుకొని బయటకొస్తూ గంగవ్వ కాళ్లకు దేవి మొక్కడం అందర్నీ ఎట్రాక్ట్ చేసింది.

కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రమే హౌజ్ లోకి వస్తున్నానని, లేడీ బిగ్ బాస్ అవుతానంటూ స్టేట్ మెంట్ ఇచ్చిన దేవి ప్రస్థానం.. ఇలా 3 వారాలకే ముగుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.

దీనికి తోడు ఆమెకి వోటింగ్స్ తక్కువ వచ్చాయి. టీవీ9 ఛానల్ మీద ఆగ్రహంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆమెకి వ్యతిరేకంగా వోటింగ్ చేశారనేది టాక్. ఇందులో నిజమెంతో?

ఇక Bigg Boss Telugu 4 – Episode 22 హైలెట్స్ విషయానికొస్తే.. ఎప్పట్లానే నాగార్జున ఈసారి కూడా ఫుల్ జోష్ తో కనిపించాడు. ఆటపాటలతో హుషారెత్తించాడు. కంటెస్టెంట్ల మధ్య సరదా గేమ్స్ ఆడించాడు. బెలూన్లు పేల్చడం, స్కిప్పింగ్, స్ట్రా ఆట, టవర్ ను బ్యాలెన్స్ చేయడం లాంటి ఫన్నీ గేమ్స్ ఆడించాడు.

మొత్తమ్మీద గాడి తప్పిందనుకున్న బిగ్ బాస్ సీజన్-4.. మూడో వారం నుంచి కుదురుకుంది. కంటెస్టెంట్లను ఎలా వాడుకోవాలి, షో ఎలా నడపాలనే అంశంపై నిర్వహకులకు ఓ క్లారిటీ వచ్చేసింది. ఇకపై హౌజ్ లో రచ్చ మరింత పీక్స్ కు వెళ్లబోతోంది

Related Stories