
మెహ్రీన్ తన నిశ్చితార్థం రద్దు చేసుకొంది. తనే స్వయంగా ప్రకటించింది. రాజకీయ నేత భవ్య బిష్ణోయ్ తో నిశ్చితార్థం జరిగిన మూడు నెలల్లోనే ఆమె బ్రేకప్ జరిగింది. పెళ్లిని క్యాన్సిల్ చేసుకొంది. దానికి కారణం ఏమిటనే విషయంలో రకరకాల ప్రచారం జరుగుతోంది.
మెహ్రీన్, భవ్య బిష్ణోయ్ కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయట ఈ మూడు నెలల్లో. ముఖ్యంగా మెహ్రీన్ ని బిష్ణోయ్ కుటుంబ సభ్యులు అవమానించారట. కొన్ని ‘సెంటిమెంట్ల’ పేరు చెప్పి ఆమెని రకరకాల మాటలన్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఐతే, ఈ విషయంలో మెహ్రీన్ స్పందిచదల్చుకోలేదు. “ఇకపై ఈ విషయంలో నా దగ్గరి నుంచి ఎలాంటి స్పందన ఉండద,”ని మొన్నే మెహ్రీన్ తన ట్విట్టర్లో రాసుకొంది. అది గడిచిపోయిన విషయం అని ఆమె అంటోంది.
మెహ్రీన్ ఇప్పుడు వరుసగా సినిమాలు ఒప్పుకుంటోంది. ఇంకా మరిన్ని సినిమాలు చేస్తుందట. పెళ్లి విషయంలో తొందరపడ్డానని భావిస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఆమె చేతిలో “ఎఫ్ 3”, మారుతి డైరక్షన్ లో రూపొందుతోన్న మూవీ ఉన్నాయ్.
ALSO READ: Mehreen calls off engagement with fiance